Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. 'జనతా గ్యారేజ్', 'భాగమతి', 'ఖిలాడీ' తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ మీడియాతో ముచ్చటించారు.
ప్రస్తుతానికి సస్పెన్స్
నటుడిగా కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. ఎందుకంటే నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! మంచి సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను. దర్శకులు హరి, హరీష్ కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పేశా. ట్రైలర్ చూస్తే నేను డాక్టర్ రోల్ చేశానని తెలుస్తోంది. ప్రస్తుతానికి నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను. ఎందుకనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. నేను వెంటనే ఓకే చెప్పడానికి
కారణం కూడా కథే. నా రోల్ గురించి
ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉండనివ్వండి.
ఆ విషయం సమంత చెప్పలేదు
సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు. అయితే సమంతకు మైయోసిటిస్ ఉందని షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి శాడ్‌గా ఫీలయ్యాను. ఆవిడ మైయోసిటిస్‌తో పోరాటం చేసి, సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు.
అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన
ఒక్క మలయాళం మాత్రమే కాదు, అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ ప్యాకేజ్డ్ స్క్రిప్ట్ ఇది. థియేటర్లలో చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను. 'ఆదిత్య 369' వంటి గొప్ప సినిమా తీసిన నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌తో ఈ సినిమా చేయటం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన చాలా హంబుల్ పర్సన్. స్టోరీ లైన్, స్క్రిప్ట్‌లో ప్రతిదీ ఆయనకు తెలుసు. దానికి ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటారు.
సరోగసీ అని చెప్పడం సులభమే కానీ..
'యశోద' ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఐడియా. మన సొసైటీ ఎటు వెళుతుందనేది చూపిస్తున్నారు. త్వరలో అది రియాలిటీగా మారుతుంది. సరోగసీ నేపథ్యంలో సినిమా తీశారు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. సైంటిఫిక్‌గా చూస్తే... మిరాకిల్. ప్రస్తుతం మలయాళంలో రెండు, మూడు సినిమాలు చేస్తున్నాను. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్న 'మాలికాపురం' చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నాం.