Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో ఉదరుశంకర్ నటిస్తున్న కొత్త సినిమా 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'. జెన్నీ హీరోయిన్, మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో, అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 11న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ని విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఉదరు శంకర్‌కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
'ఒక రోజు జరిగే కథలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. దోస్తీ సాంగ్, ఎర్రతోలు పిల్ల సాంగ్స్‌కి బాగా రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. వెంకటేష్ ట్రైలర్‌ని చూసి మా టీమ్‌ని అభినందించడం మాకు కొత్త ఎనర్జీనిచ్చింది' అని హీరో ఉదరు శంకర్ అన్నారు.
హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్, 'ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. నా పాత్ర అందర్నీ మెప్పిస్తుంది. మా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'రామానాయుడు స్టూడియోస్‌లో వెంకటేష్ చేతులు మీదుగా మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన మా ట్రైలర్ చూసి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. యూత్ ఫుల్ కంటెంట్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను' అని నిర్మాత అట్లూరి నారాయణ అన్నారు. సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్: దొలూరి నారాయణ.