Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్ జంటగా, రాజ్ విరాట్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'.
ఈ నెల 4న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్‌లో రన్ అవుతోంది. తాజాగా మరి కొన్ని థియేటర్స్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్న సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ,'మా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో ఈ రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను పెంచుతున్నాం. ఈ సినిమా సక్సెస్‌తో మా బ్యానర్లో మంచి సినిమాలు తియ్యాలనే ప్రెజర్ పెరిగింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా ధన్యవాదములు' అని అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ విరాట్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు ప్రేక్షకులనుండి ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. దీనికి నందు, రష్మి, నిర్మాతలే ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుంది' అని చెప్పారు. 'ఇంతమంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇందులో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది' అని హీరో నందు విజయ్‌కృష్ణ తెలిపారు. హీరోయిన్ రష్మీ గౌతమ్ మాట్లాడుతూ,'మేం అనుకున్న దానికి భిన్నంగా ప్రేక్షకులు మా కథను రిసీవ్ చేసుకున్నారు. ఇందులో నన్ను వాణి క్యారెక్టర్లో దర్శకుడు బాగా చూపించారు' అని అన్నారు.