Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శబరి'. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ, 'వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. మా 'శబరి' కూడా అటువంటి భిన్నమైన చిత్రమే. శబరి పాత్రను నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి చేస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో వరలక్ష్మి ఈ కథ వినటం, సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో చాలా ఎఫెక్టివ్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఇక షూటింగ్ విషయానికొస్తే, విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దీంతో మూడో షెడ్యూల్ పూర్తి అయ్యింది. నాలుగో షెడ్యూల్ ఈ నెలలో హైదరబాద్‌లో మొదలు కానుంది. దాంతో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది. నవంబర్ చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి' అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల.