Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరో విశ్వక్సేన్ నిబద్ధత లేని నటుడు. విశ్వక్ వల్ల నా ప్రాజెక్ట్ ఆగిపోవడాన్ని చాలా పెద్ద అవమానంగా భావిస్తున్నా' అని నటుడు, దర్శక, నిర్మాత అర్జున్ అన్నారు. విశ్వక్సేన్, అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా జంటగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అయితే హీరో విశ్వక్సేన్ వల్ల తాను ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తున్నానని అర్జున్ శనివారం మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'హీరో విశ్వక్సేన్కి నేను చెప్పిన కథ బాగా నచ్చింది. అలాగే ఆయన అడిగిన పారితోషికానికి కూడా అంగీకరించాను. షూటింగ్ తేదీలను చెబితే, ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ వాయిదా వేస్తున్నారు. దీంతో చాలా నష్టం జరిగింది. అలాగే జగపతిబాబు లాంటి సీనియర్ ఆర్టిస్టుల డేట్స్ కూడా వృధా అయిపోయాయి. కథకి సంబంధించి హీరో విశ్వక్ కొన్ని మార్పులు చెప్పారు. ఓ మేకర్‌గా వాటిని నేను అంగీకరించలేదు. దీంతో ఆయన మాకు సహకరించలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని ఆపేస్తున్నా. నా కెరీర్లో ఇలాంటి అవమానకర సంఘటన జరగటం ఇదే తొలిసారి' అని అర్జున్ అన్నారు.