Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈనెల 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఇందులో సరోగసీని వ్యాపారంగా మార్చేశారని చెబుతున్నారా?
- కాదండి. సరోగసీ నేపథంలో జరుగుతున్న క్రైమ్స్ చూపిస్తున్నాం. ఇది బడ్జెట్ ఎక్కువ సినిమా. అందుకే చింతా గోపాలకృష్ణరెడ్డి సహ నిర్మాతగా ఈ సినిమా చేశాం. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా మీద నమ్మకంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా నేనే చేస్తున్నాను.
ఈ కథ విన్నప్పుడు మీరెలా ఫీలయ్యారు?
- దర్శకులు హరి, హరీష్ చెప్పిన కథ విన్నాను. కొత్త పాయింట్ కావడంతో ఎగ్జైట్ అయ్యాను. శంకర్ సినిమా తరహాలో పెద్ద పాయింట్ ఉంది. ఏడెనిమిది నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఆ టైమ్‌లో 'పుష్ప', 'కెజిఎఫ్' సినిమాల డబ్బింగ్ జరుగుతోంది. మనం కూడా దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేస్తే బావుంటుందనుకున్నాం.
సమంతని ఎంపిక చేసుకోవడానికి కారణం?
- ఈ సినిమాని అన్ని భాషల్లో చేయడానికి తగ్గ కథానాయిక ఎవరని చూస్తే సమంత అయితే బావుంటుందని అనిపించింది. 'ఫ్యామిలీ మ్యాన్ 2'తో ఆవిడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమంత ఈ కథ విని, వెంటనే చేస్తానని చెప్పారు. అలాగే మరో
కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ తీసుకున్నాం. కథ డిమాండ్ చేయడంతో ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేసుకున్నాం. అయితే డబ్బింగ్ టైమ్‌లో సమంత హెల్త్ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. హిందీలో చిన్మయి చెప్పారు.
దీన్ని ప్రయోగాత్మక చిత్రంగా భావిస్తున్నారా?
- ప్రయోగం కాదు. ఎక్స్పరిమెంట్ అనుకుని చేయలేదు. ఎగ్జైట్మెంట్తో చేశా. 'నువ్వు 'ఆదిత్య 369' చెయ్యవయ్యా. నిన్ను 30 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారు' అని బాలు అంకుల్ చెప్పారు. టైమ్ ట్రావెల్ విని ఎగ్జైట్ అయ్యా. ఇప్పుడు కూడా ఈ కథ విని అలాగే చేశా. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుతమైన హాస్పిటల్ సెట్ వేశారు.
ఫస్ట్ కాపీ చూశాక ఏమనిపించింది?
- చాలా సంతృప్తికరంగా అనిపించింది. మా దర్శకులు హరి, హరీష్ కథ ప్రకారం తీశారు. అలాగే దర్శకులు హరి, హరీష్ తమిళులు. ఇద్దరికీ తెలుగు రాదు. అందుకని, తెలుగులో మాటలు రాయడానికి సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి అయితే బావుంటుందని వాళ్ళకు పరిచయం చేశా. కథానుగుణంగా ఇద్దరూ చక్కటి మాటలు రాశారు. దర్శకులకు వాళ్ళ వర్క్ బాగా నచ్చింది.హొఅలాగే సినిమా చూసి సెన్సార్ వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. తెలుగు సెన్సార్ అధికారులు బావుందన్నారు. హిందీలో సెన్సార్ అధికారి చూసి 'మీ సౌత్ వాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు' అని చెప్పారు. సినిమా చూసి సెన్సార్ అధికారి నాకు ఫోన్ చేశారు. ఆయనకు అంత నచ్చింది.