Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'రాజయోగం'. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. రామ్ గణపతి దర్శకుడు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మణి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, 'ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మేము అనుకున్నట్లుగా అవుట్‌ఫుట్ వచ్చింది' అని అన్నారు. 'రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో 100 నుంచి 150 దాకా లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. సాయి రోనక్ పర్మార్మెన్స్ ఈ సినిమాలో సూపర్బ్. ఇద్దరు హీరోయిన్స్ బాగా నటించారు. విజరు సి కుమార్ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతం హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో 'పడిందే..' అని సాగే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటను ఎంఎం శ్రీలేఖ కంపోజ్ చేశారు. థియేటర్లో ఈ పాట దద్దరిల్లిపోతుంది' అని దర్శకుడు రామ్ గణపతి తెలిపారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ, 'ఇదొక డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా ఇది. ప్రేక్షకులు రెండు గంటలు ఎంటర్టైన్ అవుతారు' అని అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'రోనక్ ఎదగాలని కోరుకునే స్నేహితుడిని నేను. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నారు. పాటలు బాగున్నాయి' అని అన్నారు.
విశ్వక్సేన్, ఐశ్వర్య అర్జున్ జంటగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. హీరో విశ్వక్ వల్ల తన ప్రాజెక్ట్‌ను ఆపేస్తున్నట్టు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి విశ్వక్ స్పందిస్తూ, నాపై అర్జున్ చేసిన అరోపణలు నన్ను బాధించాయి. నేను చెప్పిన ఏ సూచననూ ఆయన పట్టించుకోలేదు. ఆ కథ గురించి మరోసారి డిస్కస్ చేద్దామనే ఆ రోజు షూటింగ్ వద్దని చెప్పాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి మళ్లీ మొదటి మెట్టుకు దిగజారొద్దనే ఈ జాగ్రత్తలు. అంతే గానీ ఆయన్ని అగౌరపరచాలని కాదు. ఆయనకు, ఆయన మూవీకి బెస్ట్ విషెస్' అని తెలిపారు.