Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా 'నచ్చింది గర్ల్‌ఫ్రెండూ'. జెన్నీ నాయికగా నటిస్తోంది. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణల, అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు.
గురుపవన్ దర్శకుడు. ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బృందం ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు చక్కని థ్రిల్లింగ్ లవ్‌స్టొరీ అంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసలూ అందుకుంది. వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్‌తో సాగే లవ్‌స్టోరి ఇది. సినిమాలో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలుండబోతున్నాయని, అందర్నీ కచ్చితంగా ఈ సినిమా అలరిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్:ఉడగండ్ల సాగర్, ఆర్ట్: దొలూరి నారాయణ, నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్.