Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్, జెన్ని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'నచ్చింది గర్ల్‌ఫ్రెండూ'. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో, అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురుపవన్ దర్శకుడు. లవ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మీడియాతో ముచ్చటించారు. 'నేను తెలుగులో చేసిన మొదటి చిత్రం 'బాయ్స్ విల్ బీ బాయ్స్'. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన సిద్ధం మనోహర్ ఈ సినిమా కోసం రిఫర్ చేశారు. అలా ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. దర్శకుడు గురుపవన్ నా ఆడిషన్ చూసి హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాలో నేను సంధ్య అనే క్యారెక్టర్లో నటించా. శాండీ అని
పిలుస్తుంటారు. ఈ పాత్రకు రెండు భిన్నమైన షేడ్స్ ఉంటాయి. కొద్ది సేపు గ్రే షేడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంటుంది. నా క్యారెక్టర్ వరకు ఒక మంచి ట్వస్ట్ కూడా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు తర్వాత సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి కలిగింది. కథతో పాటు నా క్యారెక్టర్ చాలా బాగుండటంతో సినిమాను సంతోషంగా అంగీకరించాను. ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తానికి అన్ని ప్రధాన పాత్రలకు సంబంధం ఉంటుంది. ఒక వైపు ప్రేమ కథ సాగుతూనే థ్రిల్లర్ ఎలిమెంట్స్ అండర్ కరెంట్‌గా ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ యాప్ అంశం ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి ఏమాత్రం ఎక్కువ చెప్పినా కథ రివీల్ అవుతుంది.
హీరో ఉదయ్ శంకర్‌తో కలిసి నటించడం ప్లెజర్‌గా ఫీలవుతున్నాను. గురు పవన్ కథ విషయంలో పూర్తి స్పష్టత ఉన్న దర్శకుడు. సినిమాను ఎలా తెరకెక్కించాలో అవగాహనతో చేశారు. ఈ సినిమాలో మంచి పాటలు కుదిరాయి. వాటిని అందంగా పిక్చరైజ్ చేశారు. సినిమా నిర్మాణంలో మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఆయన పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద అద్భుతంగా కనిపిస్తుంది. ఈ చిత్రంతో ఒక కొత్త తరహా ప్రయత్నం చేశాం. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కథ, పాత్రకు ప్రాధాన్యత ఇస్తా. ఓ నటిగా ప్రేక్షకుల్ని అన్ని రకాల పాత్రలతో మెప్పించాలని ఉంది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఛాన్స్‌లు ఆశిస్తున్నా' అని జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తెలిపింది.