Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యశోద'లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు.హొతనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగాహొకనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స తీసుకుంటూ 'యశోద' డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
- థ్యాంక్యూ... ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నా ఆరోగ్యం గురించి చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే... ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం.
ఏ అంశం నచ్చి 'యశోద'కి గ్రీన్‌సిగల్ ఇచ్చారు?
- సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, 'యశోద'ని వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో ఇదొకటి. 'యశోద' క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది.దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
పురాణాల్లో 'యశోద' గురించి విన్నాం. మోడ్రన్ 'యశోద' ఎలా ఉంటుంది?
- ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన 'యశోద' గురించి తెలుసు. మా సినిమా చూసిన తర్వాత ఈ 'యశోద' క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది.
సినిమాలో సరోగసీ, పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయట..?
- కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే... సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. 'యశోద' ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం... స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు... ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్... ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది.
మీకు యాక్షన్ థ్రిల్లర్స్ చేయటం ఇష్టమా?
- అవును.'యశోద' కంటే ముందు 'యు - టర్న్' చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, 'యశోద' చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే... యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజారు చేస్తూ చేస్తున్నాను.హొ
ట్రైలర్ విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి!
- సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. అలాగే భిన్న భాషలకు చెందిన భారీ తారాగణం కూడా ఉంది. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా 'పాన్ ఇండియా' అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.
వేరొకరితో డబ్బింగ్ చెప్పించే ఛాన్స్ ఉన్నప్పటికీ, సెలైన్ బాటిల్‌తో డబ్బింగ్ చెప్పడానికి రీజన్?
- 'యశోద'కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే, చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే... వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను అంతే... నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.
ప్రజెంట్ మీ హెల్త్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు?
- వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థ్యాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం.
ఇంటర్వ్యూ సమయంలో భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైన సమంత