Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ZEE5, భారతదేశంలోనే స్వదేశంగా-అభివృద్ధి చేయబడిన వీడియో ప్రసారం చేసే ప్లాట్ఫార్మ్ ఎంతో-ఎదురుచూస్తున్న తెలుగు ఒరిజినల్ 'అహ నా పెళ్ళంట ' ట్రైలర్‌ని హైద్రాబాద్‌లో విడుదల చేసింది. విడుదలలో నటీనటులతో పాటుగా సిరీస్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఇది పెళ్ళికూతురు వారి పెళ్ళి రోజునే పెళ్ళికొడుకుని వదిలేసిన పెళ్ళికొడుకు హాస్యపూరిత నరేటివ్.సంజీవ రెడ్డి దర్శకత్వం వహించి, తమడ మీడియా ద్వారా నిర్మించబడిన ఈ ఎనిమిది ఎపిసోడ్స్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’ లో రాజ్ తరుణ్ మరియు శివాని రజశేఖర్ మరియు ఇతర హాస్యనటీనటులు నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సీరీస్ నవంబరు 17 నుండి ZEE5 పై ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది. ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు నిండిన ఈ సీరీస్ వరుడిని మండపములో ఒంటరిగా వదిలి తన మాజీ ప్రియుడితో పారిపోయిన ఒక వధువు కథ. ఈ వరుడు ప్రతీకారము తీర్చుకోవాలని నిర్ణయించుకోవడముతో కథ ముందుకు సాగుతుంది. ఈ సీరీస్ ప్రతీకారము మరియు తన తలరాతను శాశ్వతంగా మార్చివేసే ఒక కారణంలేని ప్రమాణముపై తీయబడిన ఒక హాస్యభరితమైన చిత్రీకరణ. శృంగారం మరియు హాస్యాల సమ్మేళనమైన అహ నా పెళ్ళంట బంధాలకు గురించి కొత్తగా ఆవిష్కరించింది. ఇది ప్రేక్షకులకు ఒకటి కాదు, అనేక ఆశ్చర్యాలకు గురిచేస్తుంది. టీజర్ లో చూసినట్లుగా, తాను ఒక అమ్మాయిని ఇష్టపడినా లేదా కనీసం అమ్మాయి గురించి ఆలోచించినా తన తండ్రికి గండము అని తన తల్లి తనలో నాటిన ఒక మూఢనమ్మకాన్ని శీను (రాజ్ తరుణ్ నటించారు) నమ్ముతూ ఉంటాడు, అందుకని వారితో సుఖంగా మాట్లాడలేదు. ఎంతో కాలం తరువాత, తన స్వప్న సుందరిని కలుసుకుంటాడు. అంతా బాగానే కనిపించడముతో, అతను మండపములో వధువు పక్కన నిలుచుంటాడు. ఇక్కడి నుండి అతని ప్రతీకారం ప్రారంభం అవుతుంది. చాలా మలుపులు మరియు ట్విస్టులతో ‘అహ నా పెళ్ళంట’ నవ్వుల విందు అందిస్తుంది మరియు ఒక ఖచ్ఛితమైన భావోద్వేగ రోలర్ కోస్టర్ అవుతుంది. మనీష్ కల్రా, చీఫ్ బిజినెస్ అధికారి, ZEE5 ఇండియా ఇలా అన్నారు, “అహ నా పెళ్ళంట’ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఒక ఆధునిక ప్రేమ కథ. భారతదేశపు బహుభాషా కథకుడిగా, విభిన్న కథనాల కొరకు కథకులతో భాగస్వామ్యము ద్వారా వినోదముపై దృష్టి కేంద్రీకరించుటకు మేము గర్విస్తున్నాము మరియు ఈ తెలుగు సీరీస్ ఆ దిశలో మరొక అడుగు. ప్రముఖ నటీనటులతో ఈ సీరీస్ కొద్దిగా హాస్యాన్ని జోడించి క్లిష్టమైన సంబంధాల గురించి అందంగా చెప్తుంది.”
దర్శకుడు సంజీవరెడ్డి ఇలా అన్నారు, “’అహ నా పెళ్ళంట’ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఒక కథ మరియు సీరీస్ ముగిసే సమయానికి వారి ముఖములో చిరునవ్వు మిగులుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మేము చాలా కష్టపడ్డాము; ప్రతి పాత్ర యొక్క సూక్ష్మ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ప్రేక్షకులకు కామెడీ మరియు డ్రామాల సమ్మేళనముగా అందించాలనేది మా లక్ష్యము. ZEE5తో మా భాగస్వామ్యముతో, 190+ దేశాలలోని ప్రేక్షకులు దీనిని వీక్షించే అవకాశం ఉంటుందని మేము సంతోషిస్తున్నాము మరియు వాళ్ళు దీనిని ఆనందిస్తారని ఆశిస్తున్నాము”.