Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో సంభాషించారు.
స్కేల్ పరంగా పెద్ద సినిమా
తమిళంలో 'ఒరు ఇరవు','అంబులి', 'ఆ', 'జంబులింగం' సినిమాలు తీశాం. ఐడియాస్, మేకింగ్ పరంగా కొత్తగా ఉంటాయి.ఎక్స్పరిమెంట్స్ కూడా. స్కేల్ పరంగా చూస్తే 'యశోద' పెద్ద సినిమా. ఛాలెంజ్ పరంగా అయితే సేమ్. వాస్తవ ఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. అయితే ఇందులో సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే! సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు.
సమంత డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
సమంతతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. మేం ఏం కోరుకొన్నామో... అది ఈజీగా ఇచ్చేసేవారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళుతుంది.సర్ప్రైజ్లు షాక్ ఇస్తాయి. మేం చేసిన సినిమాల్లో ఎమోషనల్ సీన్ ఇది. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. 'మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?' అని కూడా అడిగేవారు. అయితే షూటింగ్ టైమ్‌లో ఆమె ఆరోగ్యం గురించి మాకు తెలియదు. ఆమె త్వరగా కోలుకుంటారనే నమ్మకం మాకుంది.
మెడికల్ మాఫియా తరహా సినిమా
ఇది మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. లాక్డౌన్లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం భారీ సెట్ వేశాం. 'ఈవా' అని సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌కి కథకు ఏం కావాలో అది ఇవ్వడమే తెలుసు. అంతేకాదు తెలుగు, తమిళం తెలిసిన వాళ్ళను ఎంపిక చేశారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్... ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మణిశర్మ మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మార్తాండ్ కె వెంకటేష్ క్రిస్పీగా ఎడిట్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి (బుల్లి గారు) మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప కూడా మంచి నటీనటులను ఎంపిక చేశారు.
వాళ్ళిద్దరికి మంచి కమాండ్ ఉంది
మా మాతృభాష తమిళం అయినప్పటికీ పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి ఫ్లో ఈజీగా ఉండేలా చూసుకున్నారు. మా ఫీలింగ్ బాగా కన్వే చేశారు. మేం బౌండ్ స్క్రిప్ట్‌తో వాళ్ళను కలిశాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని యాడ్ చేశాం. ఇద్దరూ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళకు చాలా కమాండ్ ఉంది. దీంతో మా వర్క్ ఈజీ అయ్యింది.
రాజమౌళి మాకు స్ఫూర్తి
ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్‌ని కొత్తగాచూస్తారు. ఆవిడకు జూమ్ కాల్లో స్టోరీ నేరేట్ చేశాం. 20 మినిట్స్ చెప్పాం. ఆవిడ మౌనంగా ఉంటే మాకు ఏమీ అర్థం కాలేదు. కథ అంతా విన్నాక 'మీకు ఇటువంటి ఐడియాస్ ఎక్కడ నుంచి వస్తాయి?' అని అడిగారు. 'మీకు కథ ఓకేనా?' అని అడిగితే, చెప్పిన కథ స్క్రీన్ మీదకు తీసుకురమ్మని అన్నారు. ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ 'యశోద'. సినిమా మొత్తం చూశాక మాకు అదే అనిపించింది. ఈ విషయంలో రాజమౌళి మాకు ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ఉండాలని చెబుతారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలోనే మరో సినిమా చేయబోతున్నాం.