Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'నచ్చింది గాళ్ ఫ్రెండూ'. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయిక. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో, అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్ దర్శకుడు. నేడు (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత అట్లూరి నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ, 'ఉదయ్ కామెడీ బాగా డీల్ చేయగలడు. అందుకే ఈ చిత్రాన్ని కేవలం థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కాకుండా కామెడీ, రొమాన్స్ చేర్చాం. లవ్ స్టోరీ అంటే కేవలం ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడటం, బాధ్యత లేకుండా తిరగడం చూపిస్తుంటారు. ఈ సినిమా అలా ఉండదు. మన యువతకూ కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు, దేశం పట్ల ప్రేమ ఉన్నాయని చెబుతున్నాం. అదే ఈ మూవీలో ప్రత్యేకత. ఉదరు రాజారాం పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మధునందన్ ఫ్రెండ్ రోల్ చేశాడు. ఈ మూడు పాత్రల మధ్యే మేజర్ సినిమా సాగుతుంది. దర్శకుడు గురుపవన్ కథ ఎలా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. త్వరలో ఉదరుతో మరో సినిమా చేస్తున్నాం. అలాగే నారా రోహిత్ హీరోగా ఓ చిత్రాన్ని, ఓ పెద్ద హీరోతో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు.