Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. సహస్ర ఎంటటైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 14 నుండి ప్రారంభం కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతున్నాయి. సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి సమర్పణ: నిశాంత్, దర్శకత్వం: బసి రెడ్డి రాన, సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి, మ్యూజిక్: లిజో కె జోష్, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్: నిఖిల్ హాసన్.