Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
శుక్రవారం ఈ చిత్రం నుండి 'వాట్స్ హ్యాపెనింగ్' అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడీగా కంపోజ్ చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటని చాలా గ్రేస్ ఫుల్‌గా కోరియోగ్రఫీ చేశారు. శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ స్టయిలీష్‌గా ఆకట్టు కున్నాయి. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్ మనసులోని ఫీలింగ్స్‌ని అందంగా, మ్యాజికల్‌గా ప్రజంట్ చేశారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై తమ వాయిస్‌తో మెస్మరైజ్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్‌గా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులతోపాటు రవితేజ అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఈ సినిమా ఉంటుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల.