Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్, జెన్నీ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'నచ్చింది గర్ల్‌ఫ్రెండూ'. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్ దర్శకత్వం వహించారు.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవ వేడుకలో నిర్మాత మాట్లాడుతూ, 'మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చిన్న చిత్రమైనా వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందించారనే పేరు వచ్చింది. హైదరాబాద్‌లో థియేటర్లు పెంచుతున్నాం' అని తెలిపారు. 'చిన్న సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్ని కేంద్రాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆద్యంతం సినిమా ఆసక్తికరంగా సాగిందని, చివరి పది నిమిషాలు మమ్మల్ని కట్టిపడేశావు అంటున్నారు. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన చిత్రమిది. ఆ థ్రిల్ ఫీలింగ్ ఓటీటీలో చూస్తే రాదు' అని దర్శకుడు గురు పవన్ చెప్పారు. హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో నేను చేసిన సంధ్య పాత్ర బాగుందని చెబుతున్నారు.పర్మార్మెన్స్తో పాటు గ్లామర్ చూపించే క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉంది' అని అన్నారు. 'థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగున్నాయని చెబుతున్నారు. మా కష్టానికి ఫలితం దక్కింది. సినిమా విడుదలైన అన్ని చోట్లా షోస్ పెంచుతున్నాం' అని హీరో ఉదయ్‌శంకర్ అన్నారు.