Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది.హొ
సమంతతో పాటు మిగతా పాత్రలకుహొప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకాహొశర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో శనివారం కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ మీడియాతోహొముచ్చటించారు.హొ
కల్పికా గణేష్ మాట్లాడుతూ, ''యశోద' పర్ఫెక్ట్ ప్యాకేజ్హొఅని చెప్పాలి.హొఎంటర్టైన్మెంట్, క్యూట్ రొమాన్స్, ఎమోషన్స్... ప్రతిదీహొఉంది. పాటలు మాత్రమే మిస్సింగ్. ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలి. అందుకే, కొన్ని ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ... ఈ సినిమాలో ప్రెగెంట్ లేడీ రోల్ చేయడానికి అంగీకరించాను. మహిళలకుహొమాత్రమే కాదు, మగవాళ్ళకు, పిల్లలకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి. ఇప్పుడు వస్తున్న స్పందన సంతోషాన్ని ఇచ్చింది' అని అన్నారు. 'సమంత 'నేను బాగా చేశాను' అని చెప్పారు. నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా చూస్తే... క్యారెక్టర్లహొపేర్లు అన్నిటికీ కృష్ణుడి కనెక్ట్ ఉంటుంది. సరోగసీ కాన్సెప్ట్ కొత్తది కాదని చెప్పడానికి పేర్లు ఆ విధంగా పెట్టారేమో?, సిలికాన్ బెల్లీతో చేయడం కష్టం. ఇటువంటి కథతోహొసినిమా తీస్తున్నారనేదిహొఎగ్జైటింగ్ పార్ట్. క్యారెక్టర్ కోసం చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక మిగతా ఫిమేల్ ఆర్టిస్టులకు ఇటువంటి సినిమా చేసే ఛాన్సులు వస్తాయని, ఇటువంటి కథలు రాస్తారని ఆశిస్తున్నాను. సినిమా ఎండ్ కార్డ్స్‌లో న్యూస్ క్లిప్పింగ్స్ చూపిస్తారు. సినిమాకు అదేహొమూలం' అని దివ్య శ్రీపాద చెప్పారు.
ప్రియాంకా శర్మ మాట్లాడుతూ, 'కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడూహొచేయలేదు. ఇటువంటి కథలు అరుదు. 'యశోద' లాంటి కథల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది.హొ సమంత విషయానికి వస్తే... బాడీ డబుల్ (డూప్) ఉపయోగించే అవకాశం ఉన్నా స్వయంగా చేశారు. ఆమె డెడికేషన్‌కి హ్యాట్సాఫ్' అని తెలిపారు.