Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజా నీకం'. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. యూనిక్ కంటెంట్‌తో పాటు మారేడుమిల్లి యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్ ట్రీట్‌గా ఉన్నాయి.
'ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అని ఎన్నికల అధికారిగా నరేష్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, అక్కడి పాత్రలు ఒకొక్కటిగా పరిచయడం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్లో వినిపించిన ఈ డైలాగులు ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. 'పోలీసులు పంపిన, మిలటరీని పంపిన తలదించేదే లేదు' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌లు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. నదీ ప్రభావంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్, అడవిలో ఎద్దులతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అమేజింగ్‌గా ఉన్నాయి. ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేష్ అవుట్ స్టాడింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఇంటెన్స్ రోల్లో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు ట్రైలర్లో కీలకంగా కనిపించారు. దర్శకుడు ఎఆర్ మోహన్ యూనిక్ కంటెంట్‌తో స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేశారు. టేకింగ్ అద్భుతంగా ఉంది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బ్రిలియంట్‌గా ఉంది. రాంరెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌లా, అడవి అందాలని, అక్కడి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అబ్బూరి రవి మాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు అత్యున్నతంగా నిలిచాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది' అని చిత్ర బృందం చెప్పింది.