Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని కాంటి నెంటల్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కాంటినెంటల్ డాక్టర్లు మాట్లాడుతూ, 'కృష్ణకు కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే ఎమర్జెన్సికి తరలించి సీపీఆర్ చేశాం. దాదాపు 20 నిమిషాల సీపీఆర్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటికొచ్చారు. అనంతరం ఆయన్ని ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. కిడ్నీతోపాటు లివర్, లంగ్స్ పని చేయటం లేదు. ఇది మల్టీ ఆర్గాన్ డిజార్డర్ కిందికి వస్తుంది. అలాగే కార్డియక్ అరెస్ట్ వల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఎనిమిది మంది డాక్టర్ల బృందం ఆయన్ని అనుక్షణం పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని ఆయనకి అందిస్తున్నాం. మరో 48 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం' అని తెలిపారు.