Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'జపాన్'. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తికి ఇది 25వ సినిమా. తాజాగా 'జపాన్' ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు నిర్మాతలు.
టైటిల్‌కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీగా ఉంది. ఫస్ట్ లుక్‌లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తి ఎదురుగా మందు గ్లాస్‌తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్ ఫ్రేమ్‌లో మరొక డిఫరెంట్ గెటప్‌లో కనిపించారు కార్తి. బంగారు చొక్కా, మెడలో గొలుసులను ధరించి, ఒక చేతిలో బంగారు తుపాకీని మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్ని పట్టుకున్నట్లుగా కనిపించడం క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ జోడి కడుతోంది. అల్లు అర్జున్ 'పుష్ప'లో 'మంగళం శీను' పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ: రవి వర్మన్, ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, ప్రొడక్షన్ డిజైన్: వినేష్ బంగ్లాన్.