Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. 'ఒక మాతృభాష కథ' అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ, ''చెప్పాలని ఉంది' మా 94వ చిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు మరో ప్రతిభావంతుడైన నటుడు యష్ పూరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ఇదొక యూనిక్ సబ్జెక్ట్. డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత యష్ నటన పట్ల చాలా తృప్తిగా ఉన్నాం. తనకి, హీరోయిన్గా చేసిన స్టెఫీ పటేల్‌కి కూడా మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ చిత్రంతో అరుణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే రూపొందించాం. తెలుగు తర్వాత తమిళంతో పాటు మిగతా భాషల్లో రీమేక్ చేస్తాం. ఇది అందరికీ నచ్చుతుంది. హమ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలసి ఈ సినిమా చేసాం. విజరు చక్కని మాటలు రాశారు' అని అన్నారు.
'ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్. యాక్షన్, రొమాన్స్ కామెడీ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు. సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి' అని హీరో యష్ పూరి చెప్పారు.
నాయిక స్టెఫీ పటేల్ మాట్లాడుతూ,'సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తాను. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకులు అరుణ్‌కి కృతజ్ఞతలు' అని తెలిపారు.
వాకాడ అప్పారావు మాట్లాడుతూ,'ట్రైలర్ చూస్తూనే ఇందులో డిఫరెంట్ కంటెంట్ ఉందని నమ్మకం కలిగించింది. ఈ సినిమా చూశాను. దర్శకుడు చాలా మంచి కథతో వచ్చారు. 'చెప్పాలని ఉంది' నేషనల్ మూవీ. మాతృభాష కథ. యూనివర్శల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథ' అని చెప్పారు.
'ఆర్.బి చౌదరికి, నిర్మాతలు అంజన్ కుమార్, యోగేష్ కుమార్లకి కృతజ్ఞతలు 'చెప్పాలని ఉంది'. ఒక మాతృభాష కథ 'చెప్పాలని ఉంది'. డిసెంబర్ 9న సినిమా మీ ముందుకు వస్తోంది' అని దర్శకుడు అరుణ్ భారతి అన్నారు. హమ్స్ టెక్ ఫిలిమ్స్ యోగేష్ మాట్లాడుతూ, 'ఆర్.బి చౌదరితో కలిసి పని చేయడం గొప్ప గౌరవం. చాలా మంచి క్రియేటీవ్ టీమ్‌తో పని చేశాం. మీ అందరికీ సహకారం, ప్రోత్సాహం కావాలి' అని అన్నారు.