Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మాటలకు అందని విషాదం ఇది. సూపర్‌స్టార్ కృష్ణగారు మనల్ని వదిలి వెళ్ళిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం, ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం వీటి కలబోత. అజాతశత్రువు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారతీయ సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణగారికి అశృనివాళి' అని చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పలువురు ప్రముఖులు సైతం ట్వీట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్టు తెలుగు చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.