Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు కుటుంబానికి చెందిన వారు ఒకే ఏడాదిలో ముగ్గురు చనిపోయారు. మహేష్ సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కష్ణ..ఇలా వరుస మరణాలతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాత కృష్ణని కడసారి చూసేందుకు వచ్చిన మనవడు గౌతమ్ కష్ణ, మనవరాలు సితార వెక్కి వెక్కి ఏడ్చారు. పిల్లల విషాద స్థితిని చూసి అక్కడికొచ్చిన ప్రముఖులు, అభిమానులందరూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ నేపథ్యంలో తన తాతయ్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా బుధవారం ఓ పోస్ట్ పెట్టారు. తాతయ్య కృష్ణతో దిగిన ఫొటోని షేర్ చేసిన ఆమె, 'ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు ఎన్నో విలువైన విషయాలను నాకు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాతగారు.. మీరే నా హీరో. నేను ఒక్కరోజు తప్పకుండా మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా తాతగారు' అని సితార పేర్కొంది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాల్ని తాకింది. 'బి స్ట్రాంగ్ సితూ పాప' అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతూ కామెంట్స్ జత చేస్తున్నారు. మరోవైపు సితార తండ్రి మహేష్‌బాబు సైతం తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి పార్ధివ దేహాన్ని చూసి ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.