Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటశేఖరుడిగా తెలుగు ప్రజల హదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్‌స్టార్ కష్ణకు అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి కష్ణ భౌతికకాయానికి వందనం చేశారు. కష్ణ తనయుడు మహేష్ బాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
సూపర్ స్టార్ కష్ణ మతితో టాలీవుడ్ మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్‌బాబు, కష్ణంరాజు, కష్ణల శకం ముగిసిందని, వారు మరణించినా.. వారి సినిమాలతో, జ్ఞాపకాలతో, చేసిన సేవలతో ఎప్పటికీ చిరస్మరణీయులుగానే ఉంటారని వీరితో అనుబంధం ఉన్న పలువురు ప్రముఖులు వారిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో కష్ణ పార్థీవదేహానికి అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం మహాప్రస్థానం వరకు కష్ణ అంతిమయాత్ర కొనసాగింది.
ఏపీముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్పాటు సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులు, అభిమానులు భారీ ఎత్తున అంతిమయాత్రకు తరలివచ్చారు.
ఒకే ఇంట్లో వరుస మరణాలను తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ మహేష్‌బాబు ఇంట్లో ఒకే ఏడాది ముగ్గురు చనిపోవడంతో.. ఆ కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆప్తులైన వారిని ఒకరి తర్వాత ఒకర్ని కోల్పోతుంటే.. వచ్చే బాధ వర్ణనాతీతం. అయితే ఆ దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. తన తండ్రిని కడసారి చూడటానికి
వచ్చిన వారిని మహేష్ బాబు పలకరించారు. ఇక తాతని కడసారి చూసేందుకు వచ్చిన మనవడు గౌతమ్ కష్ణ , మనవరాలు సితార అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు. అభిమాన నటుడిని చివరిసారి చూసుకోవడానికి వచ్చిన లక్షలాది మంది అభిమానులు ఒకవైపు.. తాతయ్య పార్థివ దేహం మరో వైపు.. అసలేం జరుగుతుందో కూడా తెలియని ఆ చిన్నారులను మహేష్, నమ్రత ఓదార్చుతుంటే.. చూస్తున్న జనం కళ్లలో నీళ్లు ఆగలేదు.
బాధలోనూ ఆకలి తీర్చారు
ఇదిలా ఉంటే, తమ అభిమాన నటుడు కృష్ణను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది నగరానికి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించాలని పడిగాపులు పడ్డారు. కొందరికి అవకాశం లభించగా, మరికొందరికి లభించలేదు. అయినప్పటికీ ఏ అభిమాని కూడా ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని మహేష్‌బాబు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. 'మా హీరోని చివరి చూపు చూసేందుకు ఇక్కడికి వచ్చాం. వచ్చిన వారెవరూ ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని మహేష్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారు' అంటూ పలువురు అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.
అందరూ నేర్చుకోవాలి : బాలకృష్ణ
తెలుగు చిత్ర పరిశ్రమకి కష్ణ గారు చేసిన సేవ ఎనలేనిది. మొదటి నుంచి ఆయన అన్ని ప్రయోగాలే చేశారు. మొదటి కలర్ సినిమా, మొదటి 70 ఎంఎం సినిమా వంటి ఎన్నో కొత్త పోకడలను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆయన మంచి సంకల్పంతో ముందుకు సాగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయనకి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంచి స్నేహం ఉండేది. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు కలిసి పని చేశారు. వారిద్దరి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. వారిద్దరూ ఎప్పుడు నిర్మాత మంచి గురించే ఆలోచించేవారు. ఆ ఆలోచనని అందరూ నేర్చుకోవాలి. అలాగే కష్ణగారు నటుడిగా, నిర్మాతగా, పద్మాలయ స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయన మరణం ఆయన అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకి కూడా తీరని లోటు. ఒకే ఏడాది సోదరుడిని, తల్లిని, తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సోదరుడు మహేశ్‌కి, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి.