Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'.
ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషించారు. యూనిక్ రాబరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దర్శకుడు ఆనంద్ జె మాట్లాడుతూ, 'దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. డీవోపీ డిజికె, సంగీతం ఫణి కళ్యాణ్, ఎడిటర్ సత్య గిడుతూరి, కిట్టువిస్సాప్రగాడ, అందరూ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. మా తిరుపతి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. కొత్త నటీనటులు అందరూ చాలా అంకితభావంతో చేశారు. రావణ్ నిట్టూరు, శ్రీనికిత చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరికీ మంచి అవకాశాలు రావాలి. ఇందులో పూర్తిగా తిరుపతి నేటివిటీని చూస్తారు. మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుతుంది' అని అన్నారు.
'దర్శకుడు ఆనంద్ ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియగా ముందుకు నడిపారు. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థ్రిల్లర్‌తో పాటు ప్యామిలీ ఎలిమెంట్స్‌తో డివైన్ టచ్ ఉన్న సినిమా. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఓవర్సీస్లో కూడా సినిమా విడుదల కాబోతుంది. అందరూ థియేటర్లో చూసి ఆదరించాలి' అని నిర్మాతలు కోరారు.