Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ''సమంత వన్ విమన్ షో 'యశోద'. కథ మీద నమ్మకంతో అన్ని భాషల్లో చేస్తే బావుంటుందని అనుకున్నాం. సమంత అద్భుతం. ఆవిడ మాకు ఎనర్జీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో మబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ ఎదుర్కొంటున్నదీ అంతే! ఆవిడ మళ్ళీ సూపర్ ఎనర్జీతో వస్తారు. 'యశోద 2' గురించి చాలా మంది అడుగుతున్నారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకు వస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ ఉంటాయి. 'యశోద' సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. 'యశోద'కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే స్లోగా స్టార్ట్ అయిన సినిమా... ఆ రోజు సాయంత్రానికి మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్స్ తెచ్చుకుంది. శని, ఆదివారాలు అయితే ప్రభంజనమే. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్, యుఎస్‌లో ఈ రేంజ్ కలెక్షన్లను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. త్వరలో విడుదల చేస్తాం. 'యశోద'ను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో నాకు మా సహ నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి ఎంతో సపోర్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు రాజా సెంథిల్, రవికుమార్ సహకారం మరువలేను. ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించి పనిచేశారు' అని అన్నారు. దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ, 'అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. మాకు ఇది చాలా మ్యాజికల్ మూమెంట్. అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్‌కి, సమంతకి చాలా పెద్ద థాంక్స్' అని చెప్పారు.
'ఈ క్షణం ఇక్కడ నిలబడటానికి కారణం మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. 'మీరు రాయగలరు. రాయండి. మీ ఇద్దరూ సక్సెస్ అయితే చూడాలని ఉంది' అని మమ్మల్ని ఆశీర్వదించారు. కృష్ణప్రసాద్ గారికి ఉన్న ట్రెండీ మనసు ఇంకొకరికి ఉండదు. మాకు అవకాశం ఇచ్చిన హరి, హరీష్‌కి థాంక్స్. మమ్మల్ని హేమాంబర్ గారు బాగా సపోర్ట్ చేశారు' అని రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి తెలిపారు.