Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందిన యాంథాలజీ 'మీట్ క్యూట్'. టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేసిన 'మీట్ క్యూట్' టీమ్ శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. టీజర్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి రోలర్ కోస్టర్ ఎమోషన్ని చూపించగా, ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది.'నీకు మీట్ క్యూట్ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి' అంటూ నాని వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది.
కొన్ని అర్బన్ ప్రేమ కథలను, విభిన్న ప్రేమికుల మధ్య విభిన్న భావోద్వేగాలను ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. మనం ప్రేమించే వారితో, మనం ఇష్టపడే వాటి కోసం మాత్రమే గొడవపడతాం' అనే సందేశాన్ని ఈ యాంథాలజీ హృద్యంగా అందిస్తోంది. ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉంది.
ఈ తరం యువతకు రిలవెంట్గా ఉంది. సిరీస్‌లోని పెద్దలు రెండు తరాల మధ్య వారధిగా కనిపిస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాల సమ్మేళనంగా మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఈ సీరీస్‌ని ప్రజెంట్ చేయడంలో దర్శకురాలు దీప్తి గంటా ఆకట్టుకున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన 'మీట్‌క్యూట్' ఈనెల 25 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.