Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూతన నటుడు కార్తీక్ రాచపూడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ కిగోర్ దర్శకత్వంలో ఆర్. మాధురీ రావు నిర్మిస్తున్న వార్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్మెన్ బేస్ 51'. సంయుక్త గాలి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్‌లో కార్తీక్ రాచపూడి వార్ ఫీల్డ్‌లో సోల్జర్‌గా కనిపించారు. కండలు తిరిగిన దేహంతో, వార్ జాకెట్ ధరించి చేతిలో గన్‌తో యుద్ధభూమిలో కదలిరావడం ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
భాను చందర్, విశ్వ, జై, అదితి తివారీ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: కిగోర్, నిర్మాత: ఆర్. మాధురీ రావు, సంగీతం: రిబిన్ రిచర్డ్, స్టంట్స్ : రబిన్ సుబ్బు, ఎడిటర్: పి.వి. రామాంజనేయ రెడ్డి, డీవోపీ: కిగోర్, ఆర్ట్: రఘు కులకర్ణి, లిరిక్స్: కృష్ణకాంత్.