Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్ తాజాగా నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. యూనిక్ కంటెంట్‌తో పాటు మారేడుమిల్లి యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్ ట్రీట్‌గా ఉన్నాయి.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అని ఎన్నికల అధికారిగా నరేష్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, అక్కడి పాత్రలు ఒకొక్కటిగా పరిచయడం ఆసక్తికరంగా ఉంది.
'సాయం చేయమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి', ''కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు', 'అన్యాయంగా బెదిరించే వాడికన్నా న్యాయం కోసం ఎదిరించే వాడే బలమైనవాడు' వంటి తదితర డైలాగులు ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి.
'పోలీసులు పంపినా, మిలటరీని పంపినా తలదించేదే లేదు' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీక్వెన్స్‌లు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. నదీ ప్రవాహంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్, అడవిలో ఎద్దులతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి.
ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేష్ అవుట్ స్టాడింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఇంటెన్స్ రోల్లో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు ట్రైలర్లో కీలకంగా కనిపించారు.
దర్శకుడు ఎఆర్ మోహన్ యూనిక్ కంటెంట్‌తో స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేశారు. టేకింగ్ అద్భుతంగా ఉంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం బ్రిలియంట్‌గా ఉంది. రాంరెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌లా ఉంది. అబ్బూరి రవి మాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు అత్యున్నతంగా నిలిచాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. గతంలో 'నాంది' సినిమాలో భిన్న పాత్రలో నటించి మెప్పించిన అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎన్నికల అధికారిగా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తారనే నమ్మకం ఉంది' అని చిత్ర బృందం తెలిపింది.