Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధర్మ, బసవ, సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ (హీరో), చాందిని రావు (హీరోయిన్) జంటగా నటిస్తున్న చిత్రం 'రణస్థలి'. ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ సూరెడ్డి నిర్మించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, 'సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. చరిత్రలో జరిగే ప్రతి రక్త పాతం వెనుక ఒక రాజ తంత్రం ఉంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు. ప్రతి క్యారెక్టర్లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుందే తప్ప ఆర్టిస్టులు కనిపించరు. దర్శక, నిర్మాతలు సినిమాను బాగా తీశారు. ట్రైలర్ చూస్తుంటే టైటిల్‌కు తగ్గట్టుగా అద్భుతంగా ఉంది. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో పెద్ద పెద్ద ఫైట్స్ తీయడం చాలా గ్రేట్. ట్రైలర్లో డైలాగ్స్, ఫైట్స్ చూస్తుంటే పెద్ద సినిమాలను గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించి, టీమ్ అందరికీ మంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని చెప్పారు.