Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియాలోనే అతి పెద్దదైన కమర్షియల్ వెహికల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్యవస్థాకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజరు శంకేశ్వర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'విజయానంద్'. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను బెంగుళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమై విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ట్రైలర్‌ని పరిశీలిస్తే, తండ్రీకొడుకుల కథ ఇది. వీరిద్దరూ తాము అనుకున్న రంగంలో ఎలా విజయం సాధించారు అనేది ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను నిహాల్ రాజ్‌పుత్ పోషించారు. విజరు శంకేశ్వర్ తండ్రి బి.జి.శంకేశ్వర్‌గా అనంత నాగ్ ినటించారు. విజరు భార్య పాత్రధారిగా సిరి ప్రహ్లాద్..కుమారుడు ఆనంద్‌గా భరత్ బోపన నటించారు. వీరితో పాటు వి.రవిచంద్రన్, షైన్ శెట్టి, అర్చన కొట్టిగే, వినయ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. వి.ఆర్.ఎల్ సంస్థ వి.ఆర్.ఎల్.ఫిలింస్ సంస్థను స్థాపించి 'విజయానంద్' పేరుతో తొలి చిత్రాన్ని భారీగా తెరకెక్కించింది. రిషికా శర్మ దర్శకత్వంలో ఆనంద్ శంకేశ్వర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కీర్తన్ పూజారి, సంగీతం : గోపీసుందర్.