Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ - 2022 అవార్డు
పనాజీ: సినీ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ - 2022 అవార్డు వరించింది. ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఇప్పటివరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్ ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి అందుకున్నారు. తెలుగు సినీ నటుడిగా చిరంజీవి 150కు పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆయన నటించిన 'గాడ్‌ఫాదర్' విడుదలవగా... 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' సెట్స్‌పై ఉన్నాయి.