Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా 'జయ జయ జయ జయహే'. ఈ సినిమాను 6 కోట్ల బడ్జెట్‌తో లక్ష్మీ వారియర్, గణేశ్ మీనన్ నిర్మించగా, అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల వరకూ వసూలు చేయటం విశేషం.
'జయ తెలివైన మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్ కోసం ఖరీదైన స్కూల్లో చేర్పిస్తారు. అయితే జయను మాత్రం తన ఆశలకు వ్యతిరేకంగా ఇంటి దగ్గరలో చేరుస్తారు. అందుకే తల్లిదండ్రులపై అప్పుడప్పుడు తిరుగుబాబు చేస్తూ ఉంటుంది. దాంతో చదువు పూర్తి కాకముందే ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. పౌల్ట్రీ యజమాని రాజేష్‌ను జయకు సరైన వరుడుగా నిర్ణయిస్తారు.
అయితే తన చదువును కొనసాగించడానికి అంగీకరించిన తర్వాత పెళ్ళికి అంగీకరిస్తుంది జయ. పెళ్ళి తర్వాత జయ చదువును వాయిదా వేస్తూ, ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని రాజేష్ మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని, తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకోగా, తెలుగులో ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకోవడం విశేషం. అంకిత్ మీనన్ సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది' అని చిత్ర బృందం తెలిపింది.