Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా పాల్గొనగా, దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజరు కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణకి చిత్ర యూనిట్ నివాళి అర్పించింది.
ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంటుంది. డీవోపీ రాంరెడ్డి సినిమాని అద్భుతంగా చూపించారు. ఎడిటర్ చోటా ప్రసాద్ ఆల్ రౌండర్‌గా పని చేశారు. శ్రీచరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా ఉంది. మాటల రచయిత అబ్బూరి రవి 'నాంది' సినిమా నుండి పరిచయం. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ఒక పాట కూడా పాడారు. ప్రసాద్‌కి హ్యాపీ బర్త్ డే. ఆయనకి గిఫ్ట్ 25న ఇస్తాం. ఈ సినిమాతో పరిచయం అవుతున్న నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు మోహన్ .. ఇద్దరికీ కంగ్రాట్స్. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ, 60 శాతం ఎమోషన్ ఉంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. అన్ని భాషలలో ఆకట్టుకునే సత్తా ఉన్న సినిమా ఇది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత మోహన్ దర్శకత్వంలోనే హిందీలో కూడా ఈ సినిమా చేయాలి' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు ఏఆర్ మోహన్ మాట్లాడుతూ, 'ఇది నా 17 ఏళ్ల కల. ఈ కలని నిజం చేసిన అల్లరి నరేష్‌ని ఎప్పుడూ మర్చిపోలేను. ప్రజల జీవితాన్ని తెరపై చెప్పాలనే కోరికే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కథ. నిర్మాత రాజేష్‌కి కృతజ్ఞతలు' అని అన్నారు.
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. అందరూ థియేటర్లో చూసి నా మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం'
- నిర్మాత రాజేష్ దండా