Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్‌స్టార్ కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నింపిన సంగతి విదితమే. ఇదే ఏడాదిలో తన తల్లిని, సోదరుడిని, తండ్రిని కోల్పోయిన మహేష్‌బాబు పడుతున్న బాధ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయన ఆ విషాదంలో నుంచి బయటికొచ్చేందుకు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కన్నుమూసిన తన తండ్రి గురించి మహేష్‌బాబు ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
'మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీ నిష్క్రమణ అంతకన్నా వేడుకగా జరుగుతోంది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావం మీది. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా అలా వెళ్లిపోయాయి. కానీ విచిత్రంగా, నాలో ఇంతకు ముందెన్నడూలేని శక్తిని అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్' అని మహేష్ బాబు ట్వీట్లో పేర్కొన్నారు.