Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా, రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'శాసనసభ'. వేణు మడికంటి దర్శకుడు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర బృందం నిర్వహించిన వేడుకలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను ఏపీ మినిస్టర్ ఆర్.కె. రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి డా. గాధరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు-నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను 'నాంది' సతీష్ విడుదల చేయగా.. టైటిల్ సాంగ్‌ను వైజాగ్ %వీూజ% వంశీకృష్ణ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, 'ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లొసుగులపై సంధించిన చిన్న సైజు పాశుపతాస్త్రం ఈ సినిమా. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా' అని అన్నారు.
'సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించాం. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాని నిర్మాతలు పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు' అని దర్శకుడు వేణు మడికంటి చెప్పారు. 'మంచి సబ్జెక్ట్‌తో, మంచి కమిట్‌మెంట్‌తో ఈ సినిమా తీశాం' అని నిర్మాతలు తెలిపారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ, 'ఒక స్టార్ హీరోకి ఇచ్చే కథని నాకు ఇచ్చిన రాఘవేంద్ర రెడ్డికి థ్యాంక్స్' అని అన్నారు.