Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలోనే అతి పెద్దదైన కమర్షియల్ వెహికల్స్ కంపెనీ వీఆర్‌ఎల్ కంపెనీ వ్యవస్థాకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత విజరు శంకేశ్వర్ జీవితంలో నేపథ్యంలో రూపొందిన చిత్రం 'విజయానంద్'. వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా.ఆనంద్ శంకేశ్వర్ నిర్మించారు. రిషికా శర్మ దర్శకురాలు. పాన్ ఇండియా మూవీగా దీన్ని డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
హీరో నిహాల్ మాట్లాడుతూ, 'కన్నడలో మొదటి బయోపిక్ చేయాలని నేను, దర్శకురాలు రిషికా అనుకున్నాం. విజరు శంకేశ్వర్ గురించి ఆరు నెలలు రీసెర్చ్ చేశాం. మా రీసెర్చ్ వర్క్ నచ్చి విజరు శంకేశ్వర్ ఈ బయోపిక్‌కి గ్రీన్‌సిగల్ ఇచ్చారు. మాకు ఇది సినిమా కాదు.. ఎమోషన్' అని అన్నారు.
ఆనంద్ శంకేశ్వర్ మాట్లాడుతూ, '1976లో ఒక ట్రక్కుతో మా నాన్న ప్రయాణం మొదలైంది.. ఇప్పుడు ఐదువేలకుపైగా చేరింది. ఇంకో పదహారు వందల ట్రక్కులను కూడా మేం ఆర్డర్ చేశాం. ఆయనదొక ఇన్‌స్పిరేషనల్ జర్నీ. రెండున్నర గంటల్లో ఈ కథను ఇంత అద్భుతంగా చూపించినందుకు రిషికకి థ్యాంక్స్' అని చెప్పారు. 'బయోపిక్స్‌లో 'మహానటి' వంటి చిత్రం మళ్లీ రాదు. ఆ సినిమా స్పూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించాం. నిహాల్ ఐడియా వల్లే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. గోపీ సుందర్ సంగీతం మా సినిమాకు బ్యాక్ బోన్' అని దర్శకురాలు రిషికా శర్మ తెలిపారు.