Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రంతో కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్‌ని తెలుగులో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ నిర్మిస్తున్నారు. చినబాబు, ఎం. సుబ్బారెడ్ది సమర్పకులు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ,'ఈ సినిమాలో హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి వాళ్ళ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. సత్యదేవ్, తమన్నా కెరీర్‌లో, అలాగే ప్రేక్షకుల గుండెల్లో మా చిత్రం మాత్రం గుర్తుండి పోతుంది. మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి' అని అన్నారు. 'ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ పెట్టిన దగ్గర నుండి ఏదో మ్యాజిక్ నడుస్తోంది. ఎన్ని డేట్స్ మార్చినా కూడా ఎంతో ఓపికతో మాకు అండగా ఉన్న సత్యదేవ్‌కి థ్యాంక్స్. ఈ సినిమా ఆయన కెరీర్‌కి కొత్త టర్న్ అవుతుంది' అని సమర్పకుడు ఎం.సుబ్బారెడ్డి చెప్పారు.
దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ,'ఈ సినిమాలో లవ్ స్టోరీస్ అంటే ఏదో నార్మల్‌గా ఉండవు. మీ హార్ట్‌ని టచ్ చేసేలా ఉంటాయి. ఈ డిసెంబర్ 9న ఈ శీతాకాలంలో మా 'గుర్తుందా శీతాకాలం' చూడండి. మీ గుండెల్లో నిలిచిపోతుంది. మా నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు భరించి ఫైనల్‌గా భారీగా రిలీజ్ చేస్తున్నారు' అని తెలిపారు. 'మంచి లవ్‌స్టోరీ చేయాలని అనుకుంటున్న టైంలో నాగశేఖర్ ఈ కథ చెప్పాడు. 10 నిమిషాల్లో నేను ఈ సినిమా చేస్తా అని చెప్పా.. నా పక్కన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని ఆలోచిస్తున్న టైమ్‌లో తమన్నా చేస్తున్నారని కన్‌ఫర్మ్ చేశారు. వావ్ అనిపించింది. నేచురల్‌గా మూడు లవ్‌స్టోరిస్ కలిపిన ఒక మంచి లవ్‌స్టోరి మా సినిమా. ఈ సినిమాలో తమన్నా చేసిన క్యారెక్టర్ ఆమె ఎప్పూడూ చెయ్యలేదు. ఈ చిత్రం తప్పకుండా అందరి హృదయాల్ని గెలుచుకుంటుంది. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' అని హీరో సత్యదేవ్ అన్నారు.