Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా రూపొందిన చిత్రం 'దోస్తాన్'. సూర్య నారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మ మాట్లాడుతూ,'సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. ఈ సినిమాలో ఫైట్స్ రియలిస్టిక్‌గా ఉంటాయి. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు, లవ్, ఫ్రెండ్‌షిప్ ఇలా మూడు జోనర్స్ మీద తీశాం. ఈ సినిమా చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుంది. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు హరీష్ రావు విడుదల చేసిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండిస్టీలో పెద్దలందరూ కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. డిసెంబర్2న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న మా సినిమాకు ఏపీ, తెలంగాణలలో మంచి థియేటర్లు దొరికాయి' అని తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ : ఏలెందర్ మహావీర్, డి. ఓ. పి : వెంకటేష్ కర్రి, రవి కుమార్, ఎడిటర్ : ప్రదీప్ చంద్ర, ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్.