Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశ్యంతో తెరకెక్కిన చిత్రమే 'గుర్తుందా
శీతాకాలం' అని అంటున్నారు నిర్మాత చింతపల్లి రామారావు.
చినబాబు, ఎం, సుబ్బారెడ్ది సమర్పణలో వేదాక్షర ఫిల్మ్స్ నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని నటించిన చిత్రమిది. దర్శకుడు, నటుడైన నాగశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగుతెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్‌ఎస్‌రెడ్డి, చినబాబు నిర్మించారు. ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మీడియాతో మాట్లాడుతూ, ''ఆడు మగాడ్రా బుజ్జీ', 'గజకేసరి', సమంతతో 'టెన్' వంటి డబ్బింగ్ సినిమాలు చేశా. ఇప్పుడు 'గుర్తుందా శీతాకాలం'తో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాను. హీరో సత్యదేవ్ చాలా మంచి వ్యక్తి. తమన్నా ఇందులో బాగా చేసింది. ఈనెల 9న రెండు రాష్ట్రాల్లో 600 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత కృష్ణ వంశీ 'రంగ మార్తాండ' సినిమా, ఎన్టీఆర్ బావ మరిదితో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' చేస్తున్నాను' అని తెలిపారు.