Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ్ విజయ్ హీరోగా రూపొందిన చిత్రం 'ఆక్రోశం'. సీహెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్‌లో ఆర్.విజయ్ కుమార్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రమిది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్, ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా రూపొందిన తమిళ చిత్రం 'సినం'ను తెలుగులో 'ఆక్రోశం' పేరుతో ఈనెల 9న భారీ లెవల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు సి.హెచ్.సతీష్ కుమార్, ఆర్.విజయ్ కుమార్ మాట్లాడుతూ, 'అరుణ్ విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందాయి. ఆయన నటించిన 'ఏనుగు' సినిమాను మా బ్యానర్‌లో విడుదల చేశాం. రీసెంట్‌గా తమిళంలో ఆయన హీరోగా నటించిన 'సినం' సినిమా తమిళంలో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకుంది. దీన్ని తెలుగులో 'ఆక్రోశం' పేరుతో ఈనెల9న రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్, థ్రిల్లర్, రివేంజ్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. తప్పకుండా తెలుగు ఆడియెన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.
పల్లక్ లల్వాని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్.మనోహర్, కె.ఎస్.జి.వెంకటేష్, మరుమలార్చి భారతి తది తరులు ఇతర పాత్రల్లో నటించారు.