Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. 'ఒక మాతృభాష కథ' అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. ఈనెల 9న థియేటర్స్‌లో విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో నిఖిల్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ,'యువత ఎంతో సంతోషంగా చూడాల్సిన సినిమా ఇది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువతకు గొప్ప అవకాశం వుంది. వారికీ అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. యువతని ప్రోత్సహించడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి' అని చెప్పారు.
'ఈ సినిమా ట్రైలర్ చూశాను. యష్ పూరి చాలా బావున్నాడు. హీరోయిన్ స్టెఫీ పటేల్ కూడా అందంగా ఉంది. సినిమా అద్భుతంగా ఉంటుందనే నమ్మకం ఉంది' అని హీరో నిఖిల్ అన్నారు.
చిత్ర హీరో యష్ పూరి మాట్లాడుతూ, 'కాశ్మీర్‌లో చాలా ప్రతికూలమైన పరిస్థితులలో పదిహేను రోజుల పాటు షూట్ చేశాం. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా ఉండాలనే ఆ రిస్క్ చేశాం. ఈ సినిమా మీకు నచ్చితే అందరికీ చెప్పాలి. మీరే ఒక వేవ్ క్రియేట్ చేయాలి. ఇద్కొక్క మాటే చెప్పాలని ఉంది' అని తెలిపారు. 'దర్శకుడు అరుణ్ వెన్నెల అనే అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అస్లామ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అని నాయిక స్టెఫీ పటేల్ చెప్పారు.
దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ, 'ఒక విధంగా ఇది పాన్ ఇండియా ఫిలిం. అన్ని భాషల్లో ఉండే సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ సినిమా కోసం పని చేశారు' అని అన్నారు.