Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్‌కు అనుమతిస్తారు. 14,382 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా, 2,39,76,670 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి దశలో పోటీ పడుతున్న మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ(ఎం), భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) తదితర 36 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ 89 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలపగా, ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో బరిలో ఉంది. బీఎస్పీ 57, బీటీపీ 14, సీపీఐ(ఎం) నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపాయి. 339 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుధన్ గాధ్వీ, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివబ జడేజా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నాయకులు ఛోటు వాసవ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు, కౌంటింగ్ డిసెంబర్ 8న నిర్వహించనున్నారు.