Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్ హీరోగా 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత మల్కా పురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం 'తిరగబడరా సామి'.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
నిర్మాత మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాత కెఎస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్ట్‌ను దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరికి అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకుడు వీరశంకర్, గోసంగి సుబ్బారావు, నర్రాశివాసు, రాజా వన్నెం రెడ్డి, బెక్కం వేణుగోపాల్, నిర్మాతల సంఘం కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత డి.యస్ రావు, జీవిత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
'యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం' అని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎ.ఎస్ రవికుమార్ చౌదరి, నిర్మాత : మల్కాపురం శివకుమార్, ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి, సంగీతం: జె.బి, ఆర్ట్ : రవికుమార్ గుర్రం, ఎక్సిక్యూటివ్ నిర్మాత: బెక్కెం రవీందర్.