Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభ శ్రీ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'కథ వెనుక కథ'. సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సా ఫీస్, సాయి స్రవంతి మూవీస్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1గా దండ మూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్య్‌లో ఘనంగా జరిగింది.
'ఈ టైటిల్ వెనుక ఎన్నో కథలున్నాయి. అందరి జీవితాల్లో ఎన్నో కథలుంటాయి. మా నిర్మాత వెనుకున్న కథ ఎందరికో స్పూర్తిగా ఉంటుంది. మా కెమెరామెన్ శేఖర్ అద్భుతంగా విజువల్స్ అందించారు. ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టబోతోన్నాం' అని హీరో దుద్దుంపూడి విశ్వంత్ చెప్పారు. హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ, 'నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. అలీ గారి వల్లే ఈ ఛాన్స్ వచ్చింది' అని తెలిపారు. 'ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత మంది నటీనటులతో పని చేయడం ఆనందంగా ఉంది' అని మరో నాయిక శుభశ్రీ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ, 'మా నిర్మాత అవనింద్ర కుమార్ చాలా మంచి వ్యక్తి. ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కరోనా సమయంలో ఆయనే ఓ మందు కనిపెట్టారు. దాన్ని నేనే తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. ప్యాషన్‌తో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను చేశాం. ఇక వరుసగా సినిమాలు చేస్తాం. ఇప్పటికే ప్రొడక్షన్ నెం.2 స్టార్ట్ చేశాం. శుక్రవారం నుంచి ప్రొడక్షన్ నెం.2 షెడ్యూల్‌ను పుకెట్, బ్యాంకాక్‌లలో చిత్రీకరించబోతున్నాం. మూడో సినిమాకు కూడా సిద్ధం అవుతున్నాం' అని చెప్పారు. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, 'ఈ సినిమాను ఇంత లార్జ్ స్కేల్లో చేశామంటే మా నిర్మాతే కారణం. అలాగే సాయి చేసిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి నటీనటులు, టెక్నీషియన్స్ పని చేశారు. ఈ దండమూడి బాక్సాఫీస్ సంస్థ పేరు భవిష్యత్తులో ఇంకా బలంగా వినిపిస్తుంది. నా జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని చెప్పారు.
సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఎంతో కష్టపడ్డాడు.
- నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్