Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిశుధ్య కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా తెరకెక్కిన చిత్రం 'విట్ నెస్'. కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. అనేక చర్యలు, విధానాలు అమలులో ఉన్నప్పటికీ, దీనివల్ల ప్రతి సంవత్సరం ఎందరో పేద కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్య ఆధారంగా తెరకెక్కింది 'విట్ నెస్'. పార్థిబన్ అనే 20 ఏళ్ల కుర్రాడు సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం, అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం పోరాడు తుంది. ఆ పోరాటంలో ఆమె గెలిచిందో లేదో తెలియాలంటే 'విట్ నెస్' చూడాల్సిందే అని అంటున్నారు దర్శక, నిర్మాతలు. టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అజగం పెరుమాళ్, జి. సెల్వ , రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్ నటించారు. ఈ చిత్రం ఈనెల 9 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.