Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు కె.దశరథ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌కు 'లవ్ యూ రామ్' అనే టైటిల్‌తో కథని రాశారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరథ్ కలిసి మన ఎంటర్టైన్మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్ హీరోగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ ఫస్ట్ లుక్, సినిమా థీమ్‌ను తెలిపే వీడియోను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేయగా, థీమ్ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్.రమణ విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.దశరథ్ మాట్లాడుతూ, 'నేను చేసిన ప్రతి కథ ఓ ముగ్గురికి చెబుతాను. అందులో వినాయక్ ఒకరు. ఆయన ఇచ్చిన అద్భుతమైన సూచనలతో ఈ కథ చేశాం. అలాగే గోపి మోహన్, హరికృష్ణ నాపై ఉన్న ప్రేమతో అన్ని రకాలుగా సహాయం చేశారు. డివై చౌదరి నాకు చిన్నప్పటి ఫ్రెండ్. తనతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు. 'దశరథ్ మంచి స్ఫూర్తిని నింపే కథ చెప్పారు. ప్రస్తుత జనరేేషన్కి కావాల్సిన సందేశం ఇందులో ఉంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే అమ్మాయి, నమ్మించమే జీవితం అని భావించే అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ. చాల మంచి ఫీల్ గుడ్ మూవీ. దశరథ్ బ్రాండ్ కనిపిస్తుంది. మారేడుమిల్లి, ఖమ్మం, నార్వేల్లో షూట్ చేశాం' అని దర్శకుడు డివై చౌదరీ చెప్పారు. హీరో రోహిత్ బెహల్ మాట్లాడుతూ, 'రామ్ పాత్రని నేను చేయగలనని నమ్మిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా కంప్లీట్ ప్యాకేజ్‌లా ఉంటుంది' అని అన్నారు.
'ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది' అని నాయిక అపర్ణ జనార్దనన్ తెలిపారు. సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.