Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్యరావు, అలెగ్జాండర్ సాల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం 'ఏ జర్నీ టు కాశీ'. మునికృష్ణ దర్శకత్వంలో దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం పాత్రికేయుల సమక్షంలో మేకర్స్ విడుదల చేసారు. ఈ సందర్భంగా హీరో చైతన్యరావు మాట్లాడుతూ, 'నా కెరీర్ ప్రారంభంలో చేసిన చిత్రమిది. చాలా మంచి కథ. ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కంటెంట్ ఉన్న చిత్రం. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా రియలిస్టిక్‌గా, నాచురల్‌గా ఉంటుంది. మా చిత్రం పనోరమా ఫిలిం ఫెస్టివల్లో టాప్ 25 లిస్ట్‌లో నిలిచింది. కోలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో విన్నర్‌గానూ నిలిచింది. ప్రతి నటుడికి ఇలాంటి చిత్రం ఒకటి పడాలి. నేను ఇలాంటి చిత్రం చేయటం చాలా గొప్పగా భావిస్తున్నాను' అని తెలిపారు.
''ఏ జర్నీ టు కాశీ' అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. భారత ఖండానికి కాశీ ఒక ఆత్మ లాంటిది. కుంభమేళ షాహిస్తాన్ రోజు రెండు కోట్లమంది గంగానదిలో పవిత్ర స్నానం చేస్తారు. స్నానం చేసి జన్మరాహిత్యం పొందారని భావిస్తారు. కాశీలో చనిపోతే మోక్షప్రాప్తి పొందుతారు అనే నమ్మకం మనకి ఉంది. ఇది ఒక రోడ్ జర్నీ కథ. కాశీ యాత్ర వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో తెలుసుకోవాలి అంటే మా చిత్రాన్ని చూడండి' అని దర్శకుడు ముని కృష్ణ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇది చాలా అరుదైన సినిమా. మంచి సినిమా నిర్మించామనే తృప్తి మాకుంది. ఈనెల 17న రెండు రాష్ట్రాలలో విడుదల అవుతుంది. అందరు చూసి, మా చిత్రాన్ని హిట్ చేస్తారనే నమ్మకం మాకుంది' అని చెప్పారు.