Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 9న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ మీడియాతో ముచ్చటించారు.
'11 ఏళ్ల క్రితం 'అలా మొదలైంది' సినిమా చేశాను. ఆ తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్ కథలతో చాలా సినిమాలకు రాశాను. అయితే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు రాసిన జోనర్ మళ్ళీ రాయలేదు. నేను ఏ సినిమాకైనా కథ రాయాలి అంటే ఆ కథ నాకు ఇన్స్ప్రిరేషన్ కలిగించాలి. అలాగే ఆ కథలోని కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి. కథ ఏదైనా సరే చూసే అడియన్స్ ఎమోషన్ గా కనెక్ట్ అయినపుడే మనం సక్సెస్ అయినట్టు. ఈ సినిమా 'గీతాంజలి' జోనర్‌ను టచ్ చేసినా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తోపాటు ఎమోషన్ కలిగించే ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు వారి మనసుల లోతుల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కథ ఉంటుంది. ఈ సినిమాలో మూడు వేరేషన్స్ ఉంటాయి. చాలా నేచురల్‌గా త్రీ ఏజ్ గ్రూప్స్ కలిపిన ఒక మంచి లవ్ స్టోరినే ఇది. గతంలో మనం చూసిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్', 'ప్రేమమ్' వంటి సినిమాలు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా రావు. ఇలాంటి సినిమాలకు కరెక్ట్‌గా పోర్ట్రైట్ చేసే ఆర్టిస్టులు దొరకాలి. ఈ సినిమాలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఈ మధ్య ప్రేక్షకులు రీమేక్ సినిమాలే ఎక్కువ చూస్తున్నారు. అర్టిస్టులు కూడా రీమేక్ సినిమాలను ఛాలెంజ్‌గా తీసుకొని పోటీపడి నటిస్తున్నారు. ఎందుకంటే రీమేక్‌లో ఆర్టిస్టులు నటించిన దానికంటే ఇంకా బెటర్‌గా చేయాలని ట్రై చేస్తారు. అప్పుడు సినిమా బాగా వస్తుంది. ఆలా చేసిన ఈ సినిమా కూడా 90% ఒరిజినల్ ఉండేలా రెడీ చేశాం. ఈ సినిమాను చాలా బ్యూటిఫుల్ లొకేషన్లలో షూట్ చేశారు.ఈ సినిమాలో అందరూ చాలా చక్కగా నటించారు. మ్యూజిక్, కెమెరా పనితనం ఇలా ప్రతి ఒక్కటి ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. సెన్సిబుల్ హార్ట్ ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను, వేరే వాళ్ళు కలిసి 'మరీచిక' సినిమా చేస్తున్నాను.ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వైజయంతి బ్యానర్లో 'అన్నీ మంచి శకునములే' సినిమాకు చేస్తున్నాను' అని లక్ష్మీభూపాల్ అన్నారు.