Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ రవి హీరోగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది క్యాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 31న రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'తెలిసిందే లే..' అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ, 'సినిమాకి కథ ప్రధానం. అది బాగుంటే అన్నింటినీ అదే తీసుకొస్తుంది. ఆనంద్ రవి అంత మంచి కథ ఇచ్చారు. కథను చక్కగా డ్రైవ్ చేసేది టీమ్. ఆ టీమ్‌కు చక్కటి సపోర్ట్ చేశారు నిర్మాత సమన్య రెడ్డి. పూర్ణాచారి, ప్రియాంక మంచి లిరిక్స్ రాశారు. ఆనంత్ నారాయణ్ నెక్ట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారు. శత్రు అద్భుతమైన పాత్ర చేశారు. ఇందు, కిషోరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు' అని తెలిపారు. 'ఆనంద్ రవి కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కీ రోల్లో శత్రు, విలన్‌గా హరీష్ ఉత్తమన్ని తీసుకోవాలని అనుకున్నాం. అలా అన్ని క్యారెక్టర్స్ గురించి నెరేషన్ సమయంలోనే మాట్లాడు కున్నాం. ఇక హీరోగా ఆనంద్ రవి అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. గంగ ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డికి, మ్యాంగో మీడియా రామ్ అన్నకి థ్యాంక్స్' అని నిర్మాత సమన్య రెడ్డి అన్నారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ. 'కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కాబట్టి ఇదొక జోనర్ మూవీ అనొచ్చు. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. మీరు సినిమా చూస్తే సర్ప్రైజ్ అవుతారు. ఇది థ్రిల్లర్ మూవీయే కాదు. మంచి మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంది. మ్యూజికల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజారు చేస్తారు' అని చెప్పారు.
హీరోయిన్ కిషోరీ దత్రక్ మాట్లాడుతూ, 'మీనాక్షి అనే మంచి రోల్‌ని డైరెక్టర్ శ్రీపతి ఇచ్చారు. నా పాత్ర మంచి ఇంపాక్ట్ ఉంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని అన్నారు.